శ్రీ సాయి సత్ చరిత్రము – ప్రార్థన
శ్రీ సాయి సత్ చరిత్రము – ప్రార్థన ( శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ) ఓం శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సచ్చిదానంద సత్గురు సాయినాథ్ మహారాజ్ పాదాలకు నమస్కారించి తెలియజేయునది ఏమనగా శ్రీ సాయి సచ్చారిత్ర యొక్క ప్రతి అధ్యాయాన్ని యూట్యూబ్ ద్వారా సాయి భక్తులకు చేరవేయడానికి మేము చేసేన భక్తిపూర్వక ప్రయత్నము, శ్రీసాయిబాబా యొక్క మహిమలు, వింతలీలలును వినిన మనస్సునకు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందము కలుగును. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రమువలె విశాలమైనది. లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తి జ్ఞాన మణులను తీసి తరించ ప్రార్థన. సాయి నామము ప్రేమతో నుచ్చరించిన వారి కోరిక లన్నియు నెరవేరును, వారిని నన్ని దిశలందు కాపాడును. ఏ భక్తులయితే మనఃపూర్వకముగా సాయి నాధారపడియున్నారో వారు కథలు వినునప్పుడు మిక్కిలి సంతసించెదరు. సాయి లీలలు పాడువారి కంతులేని యానందమును శాశ్వతమైన తృప్తి కలుగును. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను మన చెవులద్వారా హృదయమందు ప్రవేశించునపుడు శరీర స్పృహయును, అహంకారమును, ద్వంద్వభావములును నిష్క్రమించును. అవి మన హృదయమందు నిల్వచేసినచో సందేహములు పటాపంచలయిపోవును. శరీరగర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వచ...