రంగుల హోలీ
రంగుల హోలీ సంత గమనంలో వస్తుంది రంగుల హోలీ....... నింపుతుంది మీ జీవితాలలో ఆనందాల కేళీ...... అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.. ‘హోలీ’ వస్తుందంటే చాలు.. దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పుర్ణిమ’గా కూడ వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగ పుట్టుపుర్వోత్తరాల గురించి పురాణాల్లో భిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో చూడండి. తెలుగు మాసాలలో చివరిదైనా ఫాల్గుణ మాసంలో వచ్చే చివరి పండుగనే హోలీ. రంగు రంగుల ఈ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అన్ని పండుగలు దాదాపు ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటాం. అయితే కలర్ ఫుల్ హోలీని మాత్రం రెండురోజు పాటు జరుపుకుంటాం. ఈ పండుగ మార్చి నెలలో 28, 29వ తేదీన జరుపుకుంటారు. రెండురోజుల పాటు జరుపుకునే ఈ పండుగ సందర్భంగా హిందూ, ముస్లిం, క్రిస్టయన్ల అన్న మత భేదాలు లేకుండా చిన్న పిల్...